నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలతో వీధులన్నీ మార్మోగాయి. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చారు. సంప్రదాయ వస్త్రాలంకరణలో నృత్యాలు చేస్తూ అలరించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఇవీ చూడండి: రేపు మంత్రివర్గ సమావేశం... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం