ETV Bharat / state

Mp Aravind: ఇకపై ఆ గ్రామాల్లోనే పర్యటిస్తా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా! - pasupu board dispute

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ​కు పసుపు బోర్డు సెగ తగిలింది. కేంద్రం.. బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనే లేదని తేల్చేయడంతో ఆయన ఇప్పటికే చిక్కుల్లో పడ్డారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్​లో.. ఓ కార్యక్రమానికి వెళ్లిన అర్వింద్ ​ను అక్కడి రైతులు అడ్డుకున్నారు.

Mp Aravind
Mp Aravind
author img

By

Published : Jun 28, 2021, 11:06 PM IST

Updated : Jun 28, 2021, 11:17 PM IST

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లారంపూర్​లో ఎంపీ అర్వింద్​కు చేదు అనుభవం ఎదురైంది. సహకార సొసైటీలో డిపాజిట్ల అక్రమాలు జరిగాయంటూ రైతుల చేపట్టిన ఆందోళనలో పాల్గొనడానికి వెళ్లిన అర్వింద్​ కాన్వాయ్​ను.. పసుపు రైతులు అడ్డుకున్నారు. బోర్డ్ ఏర్పాటుకు బాండ్​ పేపర్​ రాసి ఇచ్చి.. ఇంత వరకు నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. ఎంపీ.. రైతులతో మాట్లాడడానికి ప్రయత్నిచినా ఫలితం లేకపోగా.. వారు భాజపాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన కారులను చెదరకొట్టారు.

మీ వాటా ఎంత..?

బాల్కొండ నియోజకవర్గంలో.. సొసైటీలో అవినీతి జరుగుతుంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు. రూ. 20 కోట్ల అవినీతి జరుగుతుంటే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అక్రమాలలో వాటా ఎంతని మంత్రిని ప్రశ్నించారు. సొసైటీ రైతులకు డబ్బు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీలో ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసిన బాధితులకు న్యాయం జరిగే వరకు భాజపా కార్యకర్తలు పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు.

ఎంపీ అర్వింద్ కాన్యాయ్​ను అడ్డుకున్న పసుపు రైతులు

ఏదీ చేతకాదు..

ప్రభుత్వం.. వరి, మొక్కజొన్నలను సరైన సమయంలో కొనడం లేదన్నారు అర్వింద్. రైతులకు ఫర్టిలైజర్లు, యూరియాలు.. ఉచితంగా ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. పసుపునకు తక్కువ ధర వచ్చినప్పుడు కేంద్రానికి లేఖ రాయమంటే రాయలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఏ డిబెట్​లో మాట్లాడటానికైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. కేంద్రం.. రైతులకు అధిక ధర వచ్చేలా చేసిందని వివరించారు.

అక్రమాలను బయట పెడుతున్నందుకే..

తెరాస అక్రమాలను బయట పెడుతున్నామనే.. కార్యకర్తలను పంపించి తమను అడ్డుకుంటున్నారు. భాజపా శ్రేణులు అన్ని చూస్తునే ఉన్నారు. మమ్మల్ని అడ్డుకున్నట్లే తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటారు. మంత్రి కేటీఆర్ పర్యటిస్తే ముందస్తు అరెస్ట్​లు చేసినప్పుడు.. ఓ ఎంపీ పర్యటించినప్పుడు చేయరెందుకు..? నిజామాబాద్ పర్యటనలో ఇక ముందు బాల్కొండ నియోజకవర్గంలోనే తిరుగుతా. పసుపు రైతులు ఉన్న గ్రామాల్లో పర్యటిస్తా. ఎవరు ఆపుతారో చూస్తా. మేము తలుచుకుంటే ఎంపీ ప్రశాంత్ రెడ్డి ఇంట్లో నుంచి బయట కూడా అడుగుపెట్టలేడు.

- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

ఇదీ జరిగింది:

ఏళ్ల తరబడి పసుపు బోర్డు వస్తోందని ఆశగా ఎదురుచూసిన నిజామాబాద్‌ రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలో ప్రతి ఏటా 40వేల ఎకరాల్లో పసుపు పంట సాగు చేస్తున్నారు. దేశంలో సాగయ్యే పసుపులో 50శాతం జిల్లాలోనే ఉత్పత్తి చేస్తున్నారు. ‍పసుపు బోర్డు ఏర్పాటైతే తమ కష్టాలు తీరతాయనుకుంటే ఆశలు అడియాశలయ్యాయని వారంతా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రులే హామీలు ఇచ్చి విస్మరించటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యమం తీవ్రం...

పసుపు బోర్డుపై గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులు ఉద్యమం తీవ్రతరం చేశారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఉద్యమం తారస్థాయికి చేరింది. ఎన్నికల బరిలో రైతులు నిలవటంతో జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఇదే సమయంలో భాజపా తరఫున పోటీ చేసిన ధర్మపురి అర్వింద్... బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వగా రైతుల మద్దతుతో ఎన్నికల్లో నెగ్గారు.

హామీ నెరవేర్చండి...

అనంతరం నిజామాబాద్‌లో స్పైస్ బోర్డు ఎక్ట్సెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రయోజనం లేదని పసుపుబోర్డు తీసుకురావాలని రైతులు కోరారు. ప్రస్తుతం పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రం విముఖత వ్యక్తం చేయటంతో మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీ నెరవేర్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి: Seethakka: 'అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటకు సీఎం కేసీఆర్ కట్టుబడాలి'

Last Updated : Jun 28, 2021, 11:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.