నిజామాబాద్ మార్కెట్ పసుపు పంటతో నిండిపోయింది. సీజన్ ప్రారంభమై దాదాపు నెల కావొస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి పసుపు మార్కెట్‌కి భారీగా వస్తోంది. రోజూ 20 వేల బస్తాల పైచిలుకు సరుకు వస్తుండగా ఇవాళ ఏకంగా 25వేల బస్తాలు వచ్చాయి. ధర మాత్రం నేల చూపులే చూస్తోందని రైతన్నలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.
పెద్ద ఎత్తున పసుపు సంచులు రావటంతో కొనుగోలు ఆలస్యమవుతోందని రైతులు వాపోతున్నారు. దీని పరిస్థితే ఇలా ఉంటే ఇక ఎర్రజొన్నల సంగతేంటోనని కర్షకులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:మదమెక్కిన డ్రైవర్..