ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టి పదోన్నతుల కాలపట్టిక ప్రకటించాలని... తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు.
3 నెలల్లో పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ 30 నెలల కింద హామీ ఇచ్చారని తెలిపారు. అది ఇంతవరకు అమలు కాలేదని వాపోయారు. ఆరేళ్లుగా పదోన్నతులు లేకపోవడం వల్ల తాము నష్టపోతున్నామంటూ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి: మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం