ETV Bharat / state

ఘనంగా తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం - tdp celebrations news

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు ఎన్టీఆర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Tdp 40th Anniversary
తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం
author img

By

Published : Mar 29, 2021, 5:29 PM IST

తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిజామాబాద్​ పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెదేపా నిజామాబాద్​ పార్లమెంట్​ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

హైదరాబాద్​కు ప్రపంచ స్థాయి గుర్తింపు కేవలం తెదేపా వల్లే వచ్చిందని యాదాగౌడ్​ పేర్కొన్నారు. తెలుగువారికి రాజకీయంగా ఓనమాలు నేర్పిన పార్టీగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు పొందిందన్నారు. ఈ సందర్భంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశాడని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ రెంజర్ల సురేశ్​, పార్లమెంట్ ట్రెజరర్ బ్రహ్మానంద చారి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కొల్లాపూర్‌లో తెదేపా 40వ వార్షికోత్సవ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.