నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఇక్కట్లు తప్పట్లేదు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 890. మధ్యాహ్న భోజనం కోసం 600 నుంచి 700 మంది వరుస కడుతున్నారు. వరుసలో నిల్చున్న ఆఖరి విద్యార్థికి భోజనం అందడానికి సుమారు 40 నిమిషాలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి భోజనం కూడా అందట్లేదని విద్యార్థులు వాపోయారు. అదనంగా వడ్డించే కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం