నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కౌల్పూర్లో ఓ వింత పుకారు జోరుగా షికారు చేసింది. ఒక పురుషుడికి కుమారుడు పుడతాడంటూ కొన్ని నెలలుగా గ్రామస్థులు ఆ వ్యక్తికి పూజలు చేశారు. మహిళలైతే ఇంట్లో వాళ్లతో గొడవలు పెట్టుకుని మరీ ఆ వ్యక్తిని ఆరాధించారు. అతని వద్దకు చెప్పులు వేసుకుని రావొద్దని ఏకంగా మీడియాతో గొడవ కూడా పడ్డారు.
ఏంటీ కథ..?
కౌల్పూర్లో తనకు కుమారుడు పుడతాడని రాజు అనే వ్యక్తి ఓ పుకారు సృష్టించాడు. కొన్ని నెలల క్రితం దేవుడు ప్రత్యక్షమై తనకు కొడుకుని ఇవ్వబోతున్నట్లు గ్రామస్థులను నమ్మించాడు. ఇలా పలుమార్లు చెబుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేశాడు. ఇలా కొన్ని నెలలు కాలం గడపుతూ వచ్చాడు. ఓ వ్యక్తి రాజును గట్టిగా నిలదీయగా.. సమాధానం రాలేదు. అనంతరం ఓ వాహనంలో దుకాణం సర్దేశాడు.
ఇవీ చూడండి: ఐనవోలులో బీరు సీసాతో గొంతుకోసి హత్య