నిజామాబాద్‌లోని ఓ వ్యక్తి కరోనా లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరంతో నగరానికి చెందిన ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కరోనా అనుమానితులు అంటున్నారు. ఓ వైపు జిల్లా అధికారులు ఆసుపత్రిలో కరోనా పరీక్షల కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు చెబుతుండగా.. ఇక్కడ మాత్రం సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
పరీక్షలు చేయమని అక్కడి వైద్యులు చెబుతుండగా ఆ దృశ్యాలను సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించి తమ గోడును వెల్లడించారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.
ఇదీ చూడండి : ఉస్మానియాలోకి వర్షపు నీరు.. ఆందోళనలో రోగులు, వైద్యులు