నిజామాబాద్లో ఏబీవీపీ, హిందూ వాహిణి, భాజపా, శివసేన ఇతర నాయకులు ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలోగల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఛత్రపతి శివాజీ ధైర్యసహాసాలకు పెట్టిన పేరని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు బస్వ లక్ష్మీ నారాయణ అన్నారు. తన వీరత్వానికి ప్రతీకగా ఛత్రపతి అని పేరువచ్చిందని కొనియాడారు. ప్రజలు శివాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.
ఇవీ చూడండి: ఛత్రపతి శివాజీకి ప్రధాని మోదీ నివాళి