కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్గొన్నారు. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సెప్టెంబర్‌లో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న నిర్ణయం సరైనది కాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి అన్నారు. ఈ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశం ఉందని.. ప్రభుత్వం మరోమారు ఆలోచించి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మరో రోమన్ చక్రవర్తిలా ముఖ్యమంత్రి కేసీఆర్: భట్టి