ETV Bharat / state

నాసిరకం డ్రైనేజీ పనులతో నిజామాబాద్ వాసుల ఆందోళన

నాసిరకం పనులు నిజామాబాద్‌ నగర వాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అరకొర పనులు మూన్నాళ్లయినా ఉంటాయా అన్న అనుమానం వారిలో ఏర్పడుతోంది. నగరంలో జరుగుతున్న మురుగు నీటి కాల్వల పనుల్లో నాణ్యత లోపించింది. ఇసుక లేకుండా కేవలం డస్ట్ వాడుతూ గుత్తేదారులు మమ అనిపిస్తున్నారు. కంకర, సిమెంట్, కంకర డస్ట్ వాడుతూ పని కానిస్తున్నారు. ఈ పనులపై ఆయా కాలనీల వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా గుత్తేదారులు పట్టించుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో తోచిన విధంగా పనులు చేస్తూ ప్రజాధనం మురుగు కాల్వల్లో పోస్తున్నారు. నిజామాబాద్ నగరంలో మురుగు కాల్వల నిర్మాణంపై ఈటీవీ భారత్‌ ప్రత్యేక కథనం...

sewers construction with less quality in nizamabad
డివైడర్ల బాటలోనే మురికి కాల్వల నిర్మాణం.. గుత్తేదారుల పిసినారితనం
author img

By

Published : Dec 10, 2020, 3:04 PM IST

నిజామాబాద్‌ నగరంలో నాసిరకం పనులు నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో గుత్తేదారులు.. మురుగు నీటి కాల్వలను నాణ్యతా లోపంతో నిర్మిస్తున్నారు. నగరంలో 60 డివిజన్లు ఉంటాయి. గత జులైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనుల కోసం డివిజన్‌కు రూ.10 లక్షల చొప్పున నగర పాలక సంస్థ సాధారణ బడ్జెట్ నుంచి కేటాయించారు. ఈ పనులతో ప్రతి డివిజన్‌లో వివిధ పనులు చేపట్టారు. మురుగు కాల్వలు, కల్వర్టులు, రోడ్లు వంటి పనులను చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ నిధులతో నగర పాలక సంస్థ పరిధిలో మురుగు కాల్వల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 35 డివిజన్లలో 9కి.మీ.ల మేర ఆ పనులు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం గుత్తేదారు నిర్మాణం చేపట్టకపోవడంతో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరకొర పనులపై అనుమానం వెల్లువెత్తుతోంది. కనీస నిబంధనలు పాటించకుండా నిర్మించడం వల్ల కాల్వల నాణ్యతపై కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కంకర డస్ట్‌తో నిర్మాణాలు

నగరంలోని కోటగల్లి, న్యాల్ కల్ రోడ్డు, కంఠేశ్వర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. అయితే పనుల్లో నాణ్యతకు గుత్తేదారు తిలోదకాలిచ్చారు. ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. అవసరమైన మోతాదులో ఇనుము, కంకర, ఇసుక, సిమెంటు వాడటం లేదు. నిర్మాణంలో ఎక్కడా ఇసుక కనిపించడం లేదు. ఎక్కడ చూసినా రోబో సాండ్, సాండ్ మిక్స్ పేరుతో పిలుస్తున్న కంకర డస్ట్ మాత్రమే కనిపిస్తోంది. ఇక ఇనుము సైతం ఒక చోట వాడితే మరోచోట కనిపించడం లేదు. సిమెంటు కూడా సరిపడా వాడకపోవడంతో నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మాణ పనులు చేస్తున్న వారిని ప్రశ్నించినా ఫలితం లేకుండా పోతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా ఇసుక వినియోగించకుండా వాడుతున్నారని.. ఎన్నాళ్లు ఉంటాయో తెలియడం లేదని చెబుతున్నారు.

మూణ్ణాళ్ల ముచ్చటగా

ఇప్పటికే సుందరీకరణ పనుల్లో భాగంగా డివైడర్లను ఈ కంకర డస్ట్‌తోనే నిర్మించారు. ఇసుక లేకుండా కేవలం కంకర డస్ట్‌తో నిర్మించడం వల్ల అవి మూణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. చిన్న వాహనం తగిలినా డివైడర్లు కూలిపోతున్నాయి. ఇప్పుడు ఇదే పంథాలో మురుగు కాల్వలు నిర్మిస్తున్నారు. ఇవి ఎన్నాళ్లు ఉంటాయోనన్న అనుమానాన్ని నగర వాసులు వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకుండా పోయిందని.. తద్వారా నాసిరకం పనులు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే బల్దియా అధికారులు మాత్రం నిరంతర పర్యవేక్షణ సాగుతోందని.. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

ఇప్పటికైనా నాసిరకం పనులపై ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'సిద్దిపేట ఎంతో క్రియాశీలకం.. భవిష్యత్​లో అంతర్జాతీయ విమానాశ్రయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.