ETV Bharat / state

సీజనల్​ వ్యాధులపై అవగాహన కల్పించిన మేయర్ - Nizamabad news

నిజామాబాద్​ పట్టణ కేంద్రంలోని వాసవి నగర్​ అపార్ట్​మెంట్​లో సీజనల్​ వ్యాధుల నివారణ, నియంత్రణ మీద నగర మేయర్​ దండు నీతూ కిరణ్​ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అపార్ట్​మెంట్​ వాసులకు సీజనల్​ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.

Seminar On Seasonal Diseases Conducted By Mayor Neethu Kiran
సీజనల్​ వ్యాధులపై అవగాహన కల్పించిన మేయర్
author img

By

Published : May 24, 2020, 5:36 PM IST

నిజామాబాద్​ నగరంలోని వాసని నగర్​ అపార్ట్​మెంట్​లో సీజనల్​ వ్యాధుల నివారణ, నియంత్రణపై నగర మేయర్ దండు నీతూ కిరణ్​ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మున్సిపల్​ శాఖా మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకు నగరంలో ఇకపై ప్రతి ఆదివారం సీజనల్​ వ్యాధుల మీద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరిసర ప్రాంతాల్లో నిల్వనీటిని తొలగించడం, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిత్యం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. రోజుకో కాలనీలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.

నిజామాబాద్​లోని 44వ డివిజన్​లో వాసవి అపార్ట్​మెంట్​లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కాలనీ వాసులతో మేయర్​ మాట్లాడారు. అపార్ట్​మెంట్​ వాసులంతా.. తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి వేయాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ జితేశ్​ వి.పాటిల్​, ఎంహెచ్​వో శ్రీనివాస్​, అపార్ట్​మెంట్​ వాసులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.