నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్కావెంజర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
అందరికీ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనంతోపాటు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి : 'జీరో అవర్లో హీరోగిరి చేస్తానంటే ఎట్లా అధ్యక్షా..!'