ETV Bharat / state

ఆ ఊరిలో ఆడపిల్ల పుడితే రూ.5000 ఆర్థిక సాయం..

Rs 5000 Help If A Girl Child Is Born: అమ్మాయి పుడితే భారంగా భావించే రోజులు ఇవి. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. కడుపులో ఉండగానే చంపేద్దామా అని చూసే దుర్మార్గులు మన సమాజంలో ఎందరో. కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఆడపిల్ల పుట్టిందంటే పండగ చేసుకుంటున్నారు. అమ్మాయి పుడితే లక్ష్మీదేవిలా భావిస్తుంటారు.. ఇలా ఇంతలా మార్పు రావడానికి కారణం ఆ ఊరు సర్పంచే..

Sarpanch help 5000
ఆడపిల్ల పుడితే రూ5000
author img

By

Published : Feb 4, 2023, 7:16 PM IST

Suddapally Sarpanch Rupasathish Reddy Is Providing Rs 5000 Girl Child Born: నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలంలోని సుద్దపల్లి సర్పంచ్​ పానుగంటి రూప ఈ అమ్మలాంటి ప్రోత్సాహకానికి ముందుకొచ్చారు. ఆడపిల్ల పుడుతుందనే భయాన్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేసి.. వారికి అభయమిచ్చేలా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే చాలు.. రూ.5000లను పోస్టు ఆఫీస్​లో ఫిక్స్​ డిపాజిట్​ చేసి ఆ బాండ్​ను వారి తల్లిదండ్రులకు ఇస్తామని ప్రకటించారు.

ఈ సంవత్సరం జనవరి 26 నుంచి 2024 జనవరి 26 వరకు ఏడాది కాలం పాటు ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే ముందుకొచ్చి.. గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించగా ఏటా 20లోపు మాత్రమే ఆడపిల్లలకు సంబంధించిన జనన ధృవపత్రాలు తీసుకుంటున్నారని గుర్తించారు. ఈ లెక్కన అమ్మాయిలు తక్కువగా ఉన్నారని నిర్ధారించుకొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు తన వంతుగా ఈ ప్రోత్సాహం అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్​ రూప చెబుతున్నారు.

గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చదివించేలా ప్రోత్సహించేందుకు సర్పంచ్​ దంపతులు మొదటి అడుగు వేశారు. తమ ఇద్దరి ఆడపిల్లలను స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నట్లు చెప్పారు. కూతురు పుడితే కుటుంబం సంబురాలు చేసుకోవాలి కానీ ఆ కూతురుని ఎలా ఇంటి నుంచి బయటకు పంపిస్తామని చూడకూడదని తెలిపారు. అయితే తమకు ఆడపిల్ల జన్మిస్తే రూ.5000 ఇవ్వాలనే ఆలోచన రెండేళ్ల క్రితమే వచ్చిందని.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అమలు చేయలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి26 వరకు అందిస్తామని సర్పంచ్​ రూప, భర్త సతీశ్​రెడ్డి పేర్కొన్నారు.

"సుద్దపల్లి గ్రామంలో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిమ్​, గ్రంథాలయం, మార్కెట్​ సముదాయం వంటి అనేక రంగాల్లో ముందున్నాము. ప్రైవేట్​ స్కూల్​లకు పిల్లలను పంపించకుండా ప్రభుత్వ పాఠశాలలకే గ్రామంలో అందరి పిల్లలను పంపించాలని కోరాము. అందులో భాగంగా మా ఇద్దరి పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలకే పంపిస్తున్నాము. ఈరోజుల్లో ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తున్నారు. ఆడ, మగ ఇద్దరూ ఒకటే అన్న భావనతో ఉండాలి అందరూ. నేను పదవిలో ఉన్న ఈ ఏడాది కాలంలో ఎంతమంది ఆడపిల్లలు పుడతారో వారి అందరికీ రూ.5000 బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. మా గౌరవ వేతనాన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ విధంగా ఆడపిల్లలకు తగిన సహాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను." - రూప సతీశ్​రెడ్డి, సర్పంచ్​

సుద్దపల్లిలో ఆడపిల్ల పుడితే రూ.5000 బహుమతి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.