.
చక్కెర పరిశ్రమ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోవాలి.. లేదంటే?
రాష్ట్రంలో ఏకైక సహకార చక్కెర పరిశ్రమ. 1962లో కేవలం 10 మంది రైతులతో ప్రారంభమై.. దినదినాభివృద్ధి చెందింది. 23 వేల మంది వాటాదారులు, 10 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన ఆ పరిశ్రమ.. 12 ఏళ్ల క్రితం మూతపడింది. ఫలితంగా అన్నదాతలు చెరుకు సాగు మానేసి.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేటికీ ఆ పరిశ్రమ తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో పరిశ్రమ తెరిపించాలంటూ గతంలో అనేక ఆందోళనలు నిర్వహించిన చెరుకు రైతులు.. మరోసారి పోరాటానికి సిద్ధం అవుతున్నారు. పరిశ్రమ నడిపిస్తే చెరుకు పంట సాగు చేస్తామని చెబుతున్నారు. పరిశ్రమ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోకుంటే.. ఈనెల 4న భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి పరిశ్రమ తామే తెరిచి నడిపించుకుంటామని చెబుతోన్న నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ సహకార చక్కెర పరిశ్రమ రైతులు, కార్మికులతో మా ప్రతినిధి ముఖాముఖి..
చక్కెర పరిశ్రమ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోవాలి.. లేదంటే?
.