White Tortoise: నిజామాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అరుదైన తెల్లతాబేలు కనిపించింది. హైదరాబాద్ మదీనగూడకు చెందిన మనోజ్ కుమార్ అతడి స్నేహితుడితో కలిసి ఆగస్టులో అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. నీటి కుంటలో తెల్ల తాబేలు పిల్లలు వీరికి కనిపించాయి. వాటి చిత్రాలు తీసి బయోడైవర్సిటీ బోర్డుకు పంపించారు. జన్యు లోపం వల్ల పుడతాయని అధికారులు వివరించారు.
ఇప్పటివరకు నేపాల్‌లో రెండుచోట్ల, పశ్చిమ బంగాల్, ఒడిశా ప్రాంతంలో వీటి సంతతి ఉన్నట్లు బయోడైవర్సిటీ బోర్డులో రికార్డయ్యాయి. దక్షిణాది ప్రాంతంలో రికార్డు కావటం ఇదే మొదటిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం ఆచార్యులు శ్రీనివాసులు తెలిపారు.
ఇవీ చూడండి: