ETV Bharat / state

అరుదైన శస్త్ర చికిత్స... 105 ఏళ్ల బామ్మకు ఆపరేషన్ - నిజామాబాద్​ జిల్లా వార్తలు

నిజామాబాద్​ నగరంలో ఓ ఆస్పత్రిలో 105 ఏళ్ల బామ్మకు వైద్యులు విజయవంతంగా అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం బామ్మ ఆరోగ్యంగా ఉన్నారు.

rare surgery to 105 years old woman in nizamabad district
105 ఏళ్ల బామ్మకు అరుదైన శస్త్ర చికిత్స
author img

By

Published : Jun 24, 2020, 8:57 PM IST

నిజామాబాద్​ నగరంలోని మనోరమ ఆసుపత్రిలో 105 ఏళ్ల బామ్మకు బుధవారం ఆర్థో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అంత వయస్సున్న బామ్మకు మత్తు ఇంజక్షన్ ఇవ్వడం అనేది క్లిష్టమైన ప్రక్రియ. అయినప్పటికీ వైద్యులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆమెకు విజవంతంగా సర్జరీ చేశారు. నిజామాబాద్​ జిల్లాలోని మాక్లూర్ మండలం దాస్​నగర్​కు చెందిన కోమిని బాయి (105)కి గతంలో తొడ ఎముకకు సంబంధించి సర్జరీ జరిగింది. అయితే చిన్న లోపం కారణంగా మళ్లీ సర్జరీ చేయాల్సి వచ్చింది.

దీనితో నగరంలోని మనోరమ ఆసుపత్రిలో ఆర్థో నిపుణుడు డాక్టర్ ఆదిత్య కన్నా నేతృత్వంలో మత్తుమందు నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్ నాయన్ బామ్మకు మత్తు ఇంజక్షన్ చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోవడం వల్ల ఇతర వైద్యులు, సిబ్బంది సహకారంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం బామ్మ ఆరోగ్యంగా ఉన్నారు.

ఇవీ చూడండి: 'టిమ్స్​ను త్వరలోనే ప్రారంభిస్తాం... పూర్తిస్థాయి సిబ్బందిని నియమిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.