ETV Bharat / state

రైతుల సమస్యలపై ఈనెల 25న నిజామాబాద్​లో బహిరంగసభ

పేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ డిమాండ్​ చేశారు. అన్నదాతల సమస్యలపై.. ఈ నెల 25న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగసభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

public meeting on 25th at district center of nizamabad on farmers problems
రైతుల సమస్యలపై.. 25న భారీ బహిరంగసభ
author img

By

Published : Feb 14, 2021, 7:33 PM IST

సాగు చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 25న భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ తెలిపారు. సీపీఐ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జరపనున్న కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్​ను నగరంలోని ఎన్ఆర్ భవన్​లో ఆయన ఆవిష్కరించారు.

ఈ నెల 25న రాజీవ్​గాంధీ ఆడిటోరియం నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం.. చౌరస్తాలో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణ వివరించారు. కార్యక్రమానికి నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగారావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని వెల్లడించారు. సభకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

ఇదీ చదవండి: అ'ధర'హో అంటున్న కంది... ఆనందంలో రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.