నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వాసుపత్రి వరండాలో శవపరీక్ష చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 20న వరసగా మూడు శవాలు పోస్టుమార్టం కోసం వచ్చాయి. ఒకేసారి రావడం వల్ల లోపల స్థలం సరిపోలేదు. వరండాలోనే శవపరీక్ష జరిపారు. నీటిలో మునిగిన మృతదేహం కావడం వల్ల కదపడానికి కూడా వీలు లేకపోయిందని... కుటుంబ సభ్యులు కూడా తొందరగా చేయాలని హడావుడి చేశారని, అందువల్లే వరండాలో శవ పంచనామా చేశామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
- ఇదీ చూడండి : యూఏఈ కరెన్సీ పేరుతో మోసం