ప్రభుత్వం ప్రకటించిన డబుల్బెడ్రూమ్ పథకంలో తమకు ప్రాధాన్యత కల్పించాలని దివ్యాంగులు డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఏవిధంగా భూమి పంపిణీ చేస్తుందో... అదే విధంగా దివ్యాంగులకు మూడెకరాల చొప్పున భూమి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సడక్ బంద్పై విపక్ష నేతల భేటీ