మూడేళ్ల పాటు వరుస కరవులతో అల్లాడిన నిజామాబాద్ జిల్లా గ్రామీణ నియోజకవర్గ వాసులను గతేడాది ఆశించిన వర్షాలతో వరుణుడు మురిపించినా.. ఈ యేడు ఉగ్రరూపం చూపుతున్నాడు. పంట చేతికందుతున్న సమయంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలోని పెద్ద చెరువు కట్ట కుంగిపోయింది. దీంతో ఆయకట్టులోని రైతులతో పాటు గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
నీటి ఒత్తిడిని తగ్గిస్తే కట్ట నిలిచే అవకాశం ఉందని భావించిన రైతులు.. అలుగు తొలగించి నీటిని కిందికి వదులుతున్నారు. కుంగిపోయిన కట్టను నీటి పారుదల శాఖ అధికారులు పరిశీలించారు.
కట్ట తెగితే చేతికందిన పంటలన్నీ కొట్టుకుపోయే ప్రమాదముందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద