సర్కారు బడుల్లో వసతులు కల్పించాలంటూ నిజామాబాద్ పట్టణంలో పీడీఎస్యూ నిరసన వ్యక్తం చేసింది. 'ఎమ్మెల్యే గారూ' మా పాఠశాలను సందర్శించండి అంటూ... స్థానిక కోటగల్లీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యే ప్రతి పాఠశాలను సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: తొట్టెలతో వర్షపు నీటిని తొలగించిన ట్రాఫిక్ పోలీసులు