నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శివారులోని మామిడిపల్లి వద్ద జాతీయ రహదారిపై రైతులు ఆందోళన నిర్వహించారు. పసుపు పంటకు రూ.15 వేలు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల, కరీంనగర్, నిర్మల్ జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. రైతుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్, భాజపా మినహా అన్ని పార్టీలు రైతులకు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం గుత్తేదారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు