నిజామాబాద్‌లోని గంగస్థాన్ ఫేస్-2లో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ధ్యాన కేంద్రం ప్రారంభంమైంది. ప్రారంభ కార్యక్రమానికి మేయర్ దండు నీతూ కిరణ్ హజరయ్యారు. నగరంలో ధ్యాన మందిరం ఏర్పాటు చేయటం ప్రజలు అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
నేటి యువత... రామకృష్ణ పరమహంస, వివేకానందలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నగరవాసులు ధ్యానమందిర కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్వామి సుకృతానంద మహారాజ్, స్వామి యొగేశానందజీ స్వామి, శితికంఠానందజీ పాల్గొన్నారు.