నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాలేశ్వర్లో జరిగిన వివాహంలో వధూవరులకు విచిత్ర బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు స్నేహితులు. రొయ్యల శేఖర్,చందన వివాహ మహోత్సవంలో మిత్ర బృందం రెండు కిలోల ఉల్లిగడ్డలు పెళ్లి కానుకగా అందజేశారు. ఇటీవల ఉల్లి ధరలు ఆకాశాన్నంటడం వల్ల విలువైన బహుమతిగా భావించిన మిత్రులు... వివాహ కానుకగా ఉల్లిని బహూకరించారు. కానుకను చూసి మంటపంలో ఉన్న బంధు మిత్రులంతా గొల్లున నవ్వుకున్నారు.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!