ETV Bharat / offbeat

పుట్నాల పప్పుతో సూపర్ "టేస్టీ చిక్కీలు"! - ఇలా తయారు చేస్తే రుచి అద్భుతం! - PUTNALA PAPPU CHIKKI

- పల్లీ పట్టిని మించిన టేస్ట్​ - వింటర్​లో తప్పక ట్రై చేయాల్సిందే!

Putnala Pappu Chikki Recipe
Putnala Pappu Chikki Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2024, 10:07 AM IST

Roasted Bengal Gram Chikki Recipe : మనలో చాలా మందికి బెల్లంతో చేసిన పల్లీ పట్టీలంటే చాలా ఇష్టం. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి మేలు చేసే బెల్లం, పల్లీలతో తయారు చేసిన ఈ చిక్కీలలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే చిక్కీలను ఎక్కువ మంది పల్లీలతోనే చేస్తుంటారు. అయితే.. పుట్నాల పప్పుతో కూడా టేస్టీగా పట్టీలను తయారు చేసుకోవచ్చు. ఈ స్టోరీలో చెప్పిన విధంగా పుట్నాలతో చిక్కీలు చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, ఇక లేట్​ చేయకుండా పుట్నాల పప్పుతో చిక్కీలను ఎలా ప్రిపేర్​ చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పుట్నాల పప్పు- కప్పు
  • బెల్లం- కప్పు
  • నెయ్యి-టీస్పూన్​
  • వంటసోడా-పావుటీస్పూన్​
  • ఎండు కర్జూరం తరుగు-పావు కప్పు
  • యాలకులు-3

తయారీ విధానం :

  • ముందుగా ఒక కేక్​ మౌల్డ్​లో సిల్వర్​ ఫాయిల్​ వేసి మొత్తం స్ప్రెడ్​ చేసుకోండి.
  • తర్వాత స్టౌపై పాన్​ పెట్టి బెల్లం వేయండి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగించుకోండి. అవసరమైనతే టీ​స్పూన్​ వాటర్​ మాత్రమే వేసుకోండి.
  • కరిగిన బెల్లం మరిగి.. చిక్కగా మారాలి. చిక్కీ పర్ఫెక్ట్​గా రావాలంటే పాకం చిక్కగా ఉండాలి.
  • ఆపై మరుగుతున్న పాకంలో నెయ్యి వేసుకుని కలుపుకోండి. (పర్ఫెక్ట్​ పాకం అని తెలుసుకునేందుకు ఓ చిట్కా. అదేంటంటే కొద్దిగా పాకాన్ని తీసుకుని గిన్నెలో ఉన్న చల్లటి నీళ్లలో వేసేయండి. కొద్దిసేపటి తర్వాత పాకాన్ని నీటిలో నుంచి తీస్తే అప్పడాలలాగా విరిగిపోవాలి.)
  • ఇలా పాకం సిద్ధమయ్యాక వంటసోడా వేసి కలుపుకోండి. ఆపై ఎండు కర్జూరం తరుగు, పుట్నాల పప్పు వేసుకుని మిక్స్​ చేయండి.
  • కొద్దిసేపటి తర్వాత యాలకుల గింజలు వేసి కలపండి.
  • పాకం చిక్కగా మారి ముద్ద కడుతున్నప్పుడు.. సిల్వర్​ ఫాయిల్​ మౌల్డ్​లో వేసుకుని మొత్తం సర్దుకోండి. (సిల్వర్​ ఫాయిల్​ లేని వారు నెయ్యి రాసిన ప్లేట్​ వాడుకోవచ్చు.)
  • తర్వాత ఈ మిశ్రమాన్ని బయటకు తీయండి. నెయ్యి రాసిన చపాతీ కర్రను ఉపయోగించి మొత్తం సమానంగా రోల్ చేసుకోండి.
  • అలాగే కత్తి​తో పైన మీకు ఎంత సైజ్​లో కావాలో.. సగం కట్​ చేసుకోండి.
  • ఒక మూడు గంటల తర్వాత చూస్తే ఎంతో రుచికరంగా ఉండే పుట్నాల చిక్కీలు మీ ముందుంటాయి.
  • నచ్చితే మీరు కూడా ఇలా పుట్నాల పప్పు చిక్కీలను ఓసారి ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

సూపర్ క్రంచీ "పల్లీ కొబ్బరి పట్టిలు"- ఈ విధంగా చేస్తే​ అద్భుతంగా వస్తాయి!

ఆఫ్ట్రాల్ పల్లీ పట్టి అని తీసిపారేయకండి - ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలిస్తే వదిలిపెట్టరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.