నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ గ్రామ ధాన్యం వ్యాపారి రమణారెడ్డి ఈ నెల 21వ తేదీన హత్యకు గురయ్యాడు. అందుకు కారణం తన తల్లి సులోచనేనని రమణారెడ్డి కూతురు ఆరోపిస్తోంది. గ్రామస్థులతో కలిసి తన తల్లిని కఠినంగా శిక్షించాలని కోరుతూ.. నవీపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తోంది.
సులోచన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే.. ఆయనను హత్య చేసినట్లు కూతురు చెబుతోంది. తన తల్లిని వదిలేస్తే ఆస్తి కోసం తనను కూడా చంపేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇవీ చూడండి: నమస్తే ట్రంప్: జనసంద్రంలా మోటేరా స్టేడియం