వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సంయుక్తంగా నిజామాబాద్ ముబారక్ నగర్లోని ఆలంబన ఆశ్రమంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రామ్మోహన్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించి పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను ధారపోస్తారని తెలిపారు. కానీ కొందరు పిల్లలు మాత్రం అవన్నీ మర్చిపోయి తల్లిదండ్రులకు వృద్ధాప్యం రాగానే అశ్రద్ధ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోకపోవడాన్ని ఒక నేరంగా పరిగణించవలసి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుదర్శనం, సొసైటీ ఛైర్మన్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఆందోళనలు, ఆశల నడుమ భారత్కు బంగ్లా ప్రధాని