కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఖండించారు. నిజామాబాద్ ఎంపీగా గెలిచి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు అర్వింద్ చేసిందేమీ లేదని ఆరోపించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నా.. ఎంపీ విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.
కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే.. రాష్ట్రాలపై నెపం నెట్టాలని చూడటం బాధాకరమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత అర్వింద్‌కు లేదని పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మంచి సేవలు అందించారని అర్వింద్ పొగిడారని.. అంటే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఫలించినట్లే కదా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: KTR: సమ్మెకు ఇది సరైన సమయం కాదు