నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెతెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. తెదేపా నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు దేగాం యాదాగౌడ్… నగరంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు.
తొమ్మిది నెలల్లో 35 వేల కిలో మీటర్లు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న మహానుభావుడు ఎన్టీఆర్ అని యాదాగౌడ్ కొనియాడారు. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివని... ప్రతీ ఒక్కరి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి వినోద్ కుమార్, రాష్ట్ర రైతు కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు జక్కుల రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు