ETV Bharat / state

'నూతన భూ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం పునరాలోచించాలి' - Nizamabad real estate traders protest

నూతన భూ క్రమబద్ధీకరణ పథకంపై ప్రభుత్వం పునరాలోచించాలని నిజామాబాద్​ జిల్లా రియల్​ వ్యాపారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అట్టహాసంగా తీసుకొచ్చిన 131 జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు.

Nizamabad real estate traders protest against LRS
ఎల్​ఆర్​ఎస్​పై నిజామాబాద్ రియల్ వ్యాపారుల ఆందోళన
author img

By

Published : Sep 10, 2020, 5:09 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో రియల్​ ఎస్టేట్​ అసోసియేషన్ సభ్యులు నూతన భూ క్రమబద్ధీకరణ పథకంపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త జీవో ద్వారా ఎల్​ఆర్​ఎస్​ ఛార్జీలు పెంచడమంటే.. సామాన్య ప్రజలను దోచుకోవడమేనని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సర్ధార్ అలీ అన్నారు.

కరోనా కాలంలో ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎల్​ఆర్​ఎస్​ లేని ప్లాట్లకు యథావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 200 గజాలలోపు ఉన్న ప్లాట్లకు ఒక రూపాయికి ఎల్​ఆర్​ఎస్ ఇవ్వాలని కోరారు.

స్థానిక సంస్థల ఆమోదం పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్​ఆర్​ఎస్ ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.