నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా జితేశ్ వి పటేల్ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఆయన సంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారిగా పనిచేశారు. పట్టణంలోని పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు గుర్తించి వారికి మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఇదీ చదవండిః భారీగా ఐఏఎస్ల బదిలీలు... కొత్త పోస్టింగ్లు ఇవే...