కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించామని, ఆ ప్రాంతాల నుంచి ఎవరూ బయటకు రాకూడదని కోరారు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్. వచ్చే సోమవారం నుంచి కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణ సముదాయాలు తెరిచి ఉంచాలని ఆదేశించారు. ఒంటి గంట తర్వాత రోడ్లపై రాకూడదని, అత్యవసరమైతేనే బయటికి రావాలని విజ్ఞప్తి చేశారు. మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని పేర్కొన్నారు.
ఇవీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు