నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఏకంగా... సుగంధద్రవ్యాల బోర్డు తీసుకొచ్చానని ఎంపీ అర్వింద్ తెలిపారు. నగరంలోని బస్వగార్డెన్లో ఎంపీ అర్వింద్‌కు రైతులు అభినందన సభ నిర్వహించారు. జగిత్యాల, నిజామాబాద్ పసుపు రైతు సంఘాలు ఘనంగా సన్మానించాయి. సుగంధ ద్రవ్యాల బోర్డు ద్వారా కేవలం పసుపు రైతులే కాక మిర్చి, ఇతర పంటలు పండించే వారికి లబ్ధి చేకూరుతుందని ఎంపీ పేర్కొన్నారు.
మరో 100 బాండ్ పేపర్లైనా రాసి... వాటిని సాధించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోందని ఆరోపించారు. నిజామాబాద్‌లోని ముస్లిం మైనారిటీ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని మండిపడ్డారు. ఎన్ఆర్సీపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ క్యాబినెట్ తీర్మాణం చేయడం దారుణమని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.