ETV Bharat / state

'కేసీఆర్​కు ఈటల భయం పట్టుకుంది' - నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ తాజా వార్తలు

ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్​కు హుజూరాబాద్​ ఉపఎన్నిక భయం​ పట్టుకుందని... నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ అన్నారు. అందుకే దేశంలో అందరి సీఎంల కంటే ముందుగానే లాక్​డౌన్​ ఎత్తేసి... జిల్లాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడం పూర్తయి... ఇప్పుడు వాసాలమర్రిని బంగారు గ్రామంగా మార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

MP Arvind comments on CM KCR
ముఖ్యమంత్రి కేసీఆర్​కు హుజూరాబాద్​ ఉపఎన్నిక భయం​ పట్టుకుందన్న ఎంపీ అర్వింద్​
author img

By

Published : Jun 23, 2021, 2:10 PM IST

రాష్ట్రంలో కొవిడ్​ రెండో దశ ఉద్ధృతి తగ్గక ముందే... సీఎం కేసీఆర్​ లాక్​డౌన్​ ఎత్తేశారని... నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఈటల రాజేందర్ భయం పట్టుకుందన్నారు. హుజూరాబాద్​ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకునే... దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే లాక్​డౌన్​ ఎత్తేసి... జిల్లాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడం పూర్తయిందని... అందుకే ఇప్పుడు వాసాలమర్రిని బంగారు గ్రామంగా మార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి... ప్రైవేటు విమానాల్లో మంత్రి కేటీఆర్​ దేశాలు తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే భూముల అమ్మకాలపై సమగ్ర విచారణ చేపడుతామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Maoist Hari Bhushan: మావోయిస్టు నేత హరిభూషణ్‌ మృతి: ఎస్పీ సునీల్ దత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.