Covid treatment in Nizamabad GGH: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యానికి భరోసా ఇస్తున్నామని.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఎవరూ డబ్బులు వృథా చేసుకోవద్దని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్. ప్రతిమారాజ్ పేర్కొన్నారు.
"జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం. ఆస్పత్రికి రోజూ 200 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నారు. చాలా మందిలో కొవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయి. కరోనా ఉద్ధృతి తీవ్రంగా కనిపించడం లేదు. ఎక్కువ మందికి ప్రభుత్వం ఇచ్చే హోం ఐసోలేషన్ కిట్ సరిపోతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 43 మందికి కరోనా చికిత్స అందిస్తున్నాం. ఆస్పత్రిలో మొత్తం 747 ఆక్సిజన్ పడకలు సిద్ధం చేశాం. 225 ఐసీయూ బెడ్స్, 119 వెంటీలేటర్స్ సిద్ధంగా ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా 50 పడకల వార్డ్ సిద్ధం చేశాం. రెండు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. వారం రోజుల్లో మరొకటి అందుబాటులోకి వస్తుంది. రెమిడెసివేర్ సహా ఔషధాలకు ఎలాంటి కొరత లేదు." --- డా. ప్రతిమారాజ్, నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటిండెంట్
ఇదీ చదవండి: Fever Survey in Telangana: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఫీవర్ సర్వే