ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బరిలో నిలిచిన వారణాసిలో పోటీ చేయాలని నిజామాబాద్ పసుపు రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 50 మంది పసుపు రైతులు 'ఛలో వారణాసి' కార్యక్రమం చేపట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తామని కర్షకులు తెలిపారు. పసుపుబోర్డు ఏర్పాటు, పంటకు మద్దతు ధర సాధనే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ గ్రామీణం నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్తునట్లు పేర్కొన్నారు.
వారణాసిలో ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించబోమని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో తాము పోటీ చేసిన సమయంలో భాజపా, కాంగ్రెస్ రాజకీయంగా వాడుకున్నాయని ఆరోపించారు. కవితను లక్ష్యంగా ప్రచారం చేయటం వల్ల అసలు లక్ష్యం పక్కదారి పట్టిందని... పసుపుబోర్డు సాధన కోసం ఐదేళ్లుగా ఎంపీ కవిత పోరాటం చేశారని గుర్తు చేశారు. తమకు మద్దతుగా తమిళనాడు రైతులు వస్తున్నారని... అన్నదాతలంతా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయండి: భట్టి విక్రమార్క