నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల సర్వ సభ్య సమావేశం రసాభాసగా సాగింది. గతంలో జరిగిన సమావేశంలో గడ్డి కోసే యంత్రాలను ఎంపీటీసీకి ఒకటి చొప్పున మంజూరు చేయాలని తీర్మానించారు. దానిని కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో ఆ తీర్మానాన్ని తిరస్కరించామనీ, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించమని తీర్మానించారు.
ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మండల సర్వ సభ్య సమావేశంలో ఎంపీటీసీలు నిరసన తెలిపి, సమావేశాన్ని బహిష్కరించారు. మొత్తం 17 యూనిట్లు మండలానికి మంజూరైతే దరఖాస్తులు మాత్రం వందల సంఖ్యలో వచ్చాయనీ, ఎంత మందికి మంజూరు చేస్తారో వారు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత గాడిన పడుతున్న ప్రగతి చక్రం..