ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. నిజామాబాబ్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఆస్పత్రిలోని ప్రతి వార్డును తనిఖీ చేశారు. కొవిడ్ రోగులకు అందిస్తున్న వైద్యసదుపాయాలను పరిశీలించారు. ఐసీయూ, ప్రసూతి వార్డులో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చే వారికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని వైద్యులకు సూచించారు. సర్కారు దవాఖానాలపై ప్రజల్లో విశ్వాసం నింపాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆస్పత్రి ఇంఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మల బాలరాజ్, డాక్టర్ సరస్వతి, తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: ప్రగతి భవన్ వద్ద నర్సింగ్ అభ్యర్థుల ఆందోళన