కరోనా వ్యాధిని అరికట్టడానికి నిజామాబాద్ జిల్లా బోధన్ అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. వార్డుల వారీగా ఆశ వర్కర్లు, మెప్మా సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చే వారిని పరిశీలనలో ఉంచాలని ఆర్డీఓ గోపి రామ్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి చేతిపై స్టాంప్ వేసి వారు వచ్చిన తేదీ నుంచి 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని, వారిపై నిరంతరం నిఘా ఉంచాలని సిబ్బందికి ఆర్డీఓ దిశానిర్దేశం చేశారు
కమిటీ సభ్యులే కాకుండా వాళ్లు ఇంటి చుట్టుపక్కల వారికి భాగస్వామ్యం కల్పించి కరోనా వ్యాధిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటివారైనా... చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి: చైనాలో మూడో రోజూ కరోనా కేసులు సున్నా