సన్నాలు సాగు చేయించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిలువునా ముంచిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సన్నాలకు మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి మెమోరాండం సమర్పించారు. సన్నాలకు మద్ధతు ధర, వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయాలన్న ప్రధాన అంశాలతో వినతి పత్రం అందించారు
సన్నాలు సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం.. మద్ధతు ధర కల్పించకపోవడం దారుణమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. సన్నాలు, దొడ్డు రకాలకు ఒకే ధర ఉండటం ఎంత వరకు సమంజసమన్నారు.
ఇదీ చూడండి: 'ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహించి ఇబ్బంది పెట్టొద్దు'