నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని 7వ బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌సీటీపీసీ/ ఏఆర్ కానిస్టేబుల్స్ దీక్షిత్ కవాత్‌కు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి హాజరయ్యారు. కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 13 వ బ్యాచ్‌లో 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన 347 మంది కానిస్టేబుళ్లకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పరిపాలనకు పోలీసు శాఖ గుండె కాయ వంటిదనీ, కఠోర శిక్షణ తర్వాత సమాజానికి సేవలు అందించబోతున్నారని కానిస్టేబుళ్లను ఉద్దేశించి కలెక్టర్ అన్నారు. తప్పకుండా మంచి సర్వీసు అందిస్తారని, సమాజానికి మంచి చేయాలనే తపన, ప్రతిజ్ఞని పదవీ విరమణ వరకు నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏడవ బెటాలియన్ కమాండెంట్ ఎన్.వి సత్య శ్రీనివాస్, బెటాలియన్‌కు సంబంధించిన ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: క్రియాశీలకం కానున్న కృష్ణా యాజమాన్య మండలి