ETV Bharat / state

జిల్లాలో నరేగా జాయింట్ సెక్రటరీ పర్యటన - ఉపాధి జాబ్ కార్డులు

​ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో.. కేంద్ర బృందం నిజామాబాద్​ జిల్లాలో పర్యటించింది. ఉపాధి హామీ పనుల తీరును గురించి అధికారులను అడిగి తెలుసుకుంది.

Narega Joint Secretary visits nizamabad district
జిల్లాలో నరేగా జాయింట్ సెక్రటరీ పర్యటన
author img

By

Published : Jan 28, 2021, 9:37 AM IST

నిజామాబాద్ జిల్లా లింగంపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ​ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్ పరిశీలించారు. కేంద్ర బృందం, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిలతో కలిసి పథకం వల్ల కూలీలు ఏ విధంగా లాభపడుతున్నారో.. వారినే అడిగి తెలుసుకున్నారు.

ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులను పరిశీలించి.. పని కొలతలు, వేతనాల గురించి అధికారులను ఆరా తీశారు రోహిత్​. అనంతరం పెద్ద చెరువు వద్దనున్న వర్క్ సైట్ బోర్డ్​లను పరిశీలించారు. కంపోస్ట్ షెడ్ బాగుందని మెచ్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, డీఆర్​డీఓ శ్రీనివాస్, ఎంపీడీవో సంజీవ్ కుమార్, సర్పంచ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మందులు ఎక్కడపడితే అక్కడ పెడుతున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.