ETV Bharat / state

అంగన్వాడీ టీచర్ దాతృత్వం.. బండారు దత్తాత్రేయ అభినందనలు

ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చారు. లాక్​డౌన్ కారణంగా తినేందుకు తిండి కూడా దొరక్క సొంతగూటికి బయలుదేరిన వారికి అన్నపూర్ణదేవిగా మారింది ఓ అంగన్వాడీ టీచర్. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలకు రోజూ వండి వడ్డిస్తోంది.

anganwadi teacher help to migrant workers
వలస కూలీల పాలిట అన్నపూర్ణ.. ఓ అంగన్వాడీ టీచర్
author img

By

Published : May 4, 2020, 3:22 PM IST

నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండల కేంద్రానికి చెందిన అమీనా బేగం అనే అంగన్వాడీ టీచర్... వలస కూలీల బాధలు చూడలేక గత 34 రోజులుగా భోజనం వండి పెడుతోంది. ఆమెకు వచ్చే జీతం ఆమెకే సరిపోకపోయినప్పటికీ వసస కూలీల బాధలు చూడలేకే తనవంతు సాయంగా భోజనం పెడుతున్నట్లు తెలిపింది.

లాక్​డౌన్ సమయంలో అనేక మంది వలస కూలీలు 44వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నారని... అలా వెళ్లే వాళ్లందరికీ అన్నం పెడుతున్నట్ల అమీనా బేగం పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఈనాడు దినపత్రిక ద్వారా చూసిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అమీనా బేగంకు ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​లో ఒక్క రోజులోనే 20 కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.