పత్తి రైతులకు మద్దతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎస్ సోమేశ్ కుమార్ను కోరారు. సరైన ధర రాక ఇబ్బంది పడుతున్న రైతులకు మార్కెట్ ఇంటర్వేన్షన్ పథకం ద్వారా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ఎగుమతుల పథకం కింద వాణిజ్య సదుపాయాలు.. క్లస్టర్లు, పసుపు ప్రాంతీయ డైరెక్టరేట్ ద్వారా రైతులకు మౌలిక సదుపాయలను పెంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. అవి రాష్ట్రానికి అందాలంటే ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
ఇదీ చూడండి : 'పారిశుద్ధ్య సిబ్బంది సేవలు భేష్... టీకాలో వారికే ప్రాధాన్యం'