నిజామాబాద్‌లో రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పర్యటించారు. నాందేవ్వాడలో ప్రజలతో ముచ్చటించారు. ఇబ్బందులేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... అధికారులు బాగా పనిచేస్తున్నారని భరోసా ఇచ్చారు.
కాలనీలో ఇప్పటి వరకు ఎవ్వరికీ కరోనా పాజిటివ్ రాలేదని... అయినప్పటికీ స్థానికులంతా ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. అవసరమైతే తప్ప బయటకి రావద్దన్నారు. ప్రభుత్వ నియమాలు పాటించి కరోనాను తరిమికొడదామని సూచించారు.