MLA Candidate Suicide in Nizamabad : మార్ఫింగ్ వీడియోలతో సైబర్ నేరగాళ్ల బెదిరింపులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనికి భయపడిన బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు మానసికంగా బలహీనంగా మారి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ విధంగానే తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన యమగంటి కన్నయ్య గౌడ్ (36) అనే అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. నగరంలోని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయినగర్‌లో నివాసముంటున్న కన్నయ్య ఆదివారం వేకువజామున ఇంట్లో ఉరి వేసుకున్నారు.
MLA Candidate Suicide in Telangana : కన్నయ్య ఉరేసుకున్న విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆయనను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కన్నయ్య గౌడ్ మొబైల్‌ను గుర్తు తెలియని దుండగులు హ్యాక్ చేసి ఆయనను బెదిరించారు. ఆయనకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు(Morphing videos) పంపి వేధింపులకు గురి చేశారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామన్నారు. దీంతో మనస్తాపానికి గురైన కన్నయ్య గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్నయ్య ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి ఆయన బరిలో నిలిచారు.
పెళ్లి చేయరేమో అన్న భయంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
MLA Candidate Suicide due to Morphing videos : కన్నయ్య ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్ల(Cyber Criminals)పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎందుకు బెదిరించారు? తన ఫోన్‌కు ఎలాంటి సందేశాలు వచ్చాయి? డబ్బులు ఏమైనా మళ్లించారా.. అని పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.
ఫ్లెక్సీ వివాదంలో యువకుడు ఆత్మహత్య - పరామర్శించేందుకు సిద్ధమైన మహాసేన రాజేష్ గృహనిర్బంధం
హైదరాబాద్‌లో విషాదం - కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య
Family Mass Suicide : ఒకే కుటుంబంలో ఏడుగురు సామూహిక ఆత్మహత్య.. ఆరుగురికి విషం ఇచ్చి.. ఆపై..