నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో మిషన్ భగీరథ పైప్లైన్ (mission Bhagiratha pipeline) పగలడంతో ఉవ్వెత్తున నీరు ఎగిసిపడింది. స్థానిక కాలనీలు నీట మునిగాయి. ఆ ప్రాంత కౌన్సిలర్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం మరమ్మతులు చేసి, సరఫరా సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. సుమారు నాలుగు గంటల పాటు నీరు వృథాగా పోయింది.
పైపుల నిర్మాణంలో నిర్లక్ష్యంతోనే తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లీకేజీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. వాటిని పకడ్బందీగా అరికట్టాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: రోడ్డుపై మిషన్ భగీరథ ఫౌంటెయిన్