నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండల పరిధిలోని నాగపూర్ శ్రీరాం సాగర్ జలాశయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 80 లక్షల చేపపిల్లలను వదిలారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతున్నట్టు మంత్రి తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి కొరకు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంచుతున్నదని మంత్రి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 924 చెరువుల్లో 4కోట్ల 49లక్షల చేపపిల్లలను వదలనున్నట్టు మంత్రి తెలిపారు. మత్స్యకారులు.. మత్స్య కార్మికులు కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే మత్స్య సంపదను అందిస్తున్నదని.. మత్స్య కార్మికులు కష్టపడి చేపలను పెంచుకొని ఉపాధి పొందాలని మంత్రి సూచించారు.
ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి!
జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. జిల్లాలో 566 ఆక్సిజన్ బెడ్లు, 55 వెంటిలేటర్లు ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆక్సిజన్ బెడ్ మీద 65 మంది, వెంటిలేటర్‌పై ఏడుగురు చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ.. పోషకాహారం తీసుకోవాలని, మాస్కులు ధరించాలని ప్రజలను కోరారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్