నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ వద్ద గోదావరి నదిలో జరిగిన ప్రమాదంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
"ఒకే ఇంటికి చెందిన ముగ్గురితో పాటు మరో ముగ్గురు మొత్తం ఆరుగురు మరణించడం చాలా బాధాకరం. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా. ఇలాంటివి పునరావృతం కాకుండా సీసీ పిల్లర్స్ వెయిస్తా. ప్రవాహం ఎక్కువగా ఉన్న చోటుకు పోకుండా ఒక వీఆర్వో, గజ ఈతగాళ్లను నియమిస్తాం."
-వేముల ప్రశాంత్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
ఇదీ చూడండి: నిజామాబాద్ జిల్లాలో ఘోరం... గోదావరిలో మునిగి ఆరుగురు మృతి